Rajini 173: రజనీకాంత్-కమల్ హాసన్ కాంబినేషన్‌లో యువ దర్శకుడికి అరుదైన అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్‌స్టార్ రజనీకాంత్ 173వ సినిమా(Rajini 173)కు సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. కమల్ హాసన్ నిర్మాణ సారథ్యంలో రూపొందనున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు శిబి చక్రవర్తి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ శనివారం ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోకు 'ప్రతి హీరోకు ఓ ఫ్యామిలీ ఉంటుంది' అనే క్యాప్షన్ జతచేయడం విశేషం. కమల్ హాసన్ సారథ్యంలో రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించనున్నారు. సినిమా విడుదలను 2027సంక్రాంతికి ప్లాన్ చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది.
Details
ఈ చిత్రానికి దర్శకుడిగా సుందర్
ఇంతకుముందు ఈ చిత్రానికి దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహిస్తారని ప్రకటన వచ్చింది. అయితే అనుకోని కారణాలతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో కొత్త దర్శకుడు ఎవరు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే రజనీకాంత్‌ను డైరెక్ట్ చేసే అరుదైన అవకాశం శిబి చక్రవర్తికి దక్కింది. శిబి చక్రవర్తి 2022లో తెరకెక్కించిన 'డాన్' అనే తమిళ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆ విజయంతో ఆయనపై పరిశ్రమలో మంచి గుర్తింపు లభించగా, ఇప్పుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను అందుకున్నారు.