Loading...
Varanasi OTT Rights: వారణాసి ఓటీటీ హక్కులకు రూ.450 కోట్ల డీల్? నెట్‌ఫ్లిక్స్‌తో రాజమౌళి టీమ్ చర్చలు!
వారణాసి ఓటీటీ హక్కులకు రూ.450 కోట్ల డీల్? నెట్‌ఫ్లిక్స్‌తో రాజమౌళి టీమ్ చర్చలు!

Varanasi OTT Rights: వారణాసి ఓటీటీ హక్కులకు రూ.450 కోట్ల డీల్? నెట్‌ఫ్లిక్స్‌తో రాజమౌళి టీమ్ చర్చలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2026
03:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి'పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

జనవరి నాటికి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి

'వారణాసి' పోస్ట్ ప్రొడక్షన్ పనులను జనవరి నాటికి పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

అనంతరం ఫిబ్రవరి, మార్చి నెలల్లో వివిధ ఫార్మాట్లకు సంబంధించిన పనులను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

సినిమా విడుదలకు ముందే అన్ని సాంకేతిక పనులను సిద్ధం చేసేందుకు రాజమౌళి బృందం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు టాక్.

వివరాలు

నెట్‌ఫ్లిక్స్‌తో రూ.450 కోట్ల ఓటీటీ డీల్?

'వారణాసి' డిజిటల్ హక్కుల వ్యవహారం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నెలాఖరులోగా ఓటీటీ డీల్‌ను పూర్తి చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట.

ఈ సినిమా డిజిటల్ హక్కులు ఏకంగా రూ.400 కోట్ల నుంచి రూ.450 కోట్ల వరకు పలికే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నట్లు సమాచారం.

ఇందుకోసం రూ.290 కోట్లకు భారీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు మైత్రీ మూవీ మేకర్స్‌కు

ఇప్పుడు ఓటీటీ హక్కులు కూడా రూ.400-450 కోట్ల వరకు పలికే అవకాశం ఉందన్న వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

ఈ నెలలోనే ఓటీటీ డీల్ ఖరారైతే.. సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది.

ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచాయి.

మరి నెట్‌ఫ్లిక్స్‌తో నిజంగానే రూ.450 కోట్ల డీల్ కుదురుతుందా? తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం జరిగినట్లు చెబుతున్న రూ.290 కోట్ల ఒప్పందం ఎంతవరకు నిజం? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ADVERTISEMENT