Loading...
NTRxTrivikram: ఒక్క ఫోటోతో అన్ని అనుమానాలకు ఫుల్‌స్టాప్.. తారక్ ఫ్యాన్స్‌కు నాగవంశీ గుడ్ న్యూస్!
ఒక్క ఫోటోతో అన్ని అనుమానాలకు ఫుల్‌స్టాప్.. తారక్ ఫ్యాన్స్‌కు నాగవంశీ గుడ్ న్యూస్!

NTRxTrivikram: ఒక్క ఫోటోతో అన్ని అనుమానాలకు ఫుల్‌స్టాప్.. తారక్ ఫ్యాన్స్‌కు నాగవంశీ గుడ్ న్యూస్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 13, 2026
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొద్దిరోజులుగా టాలీవుడ్‌లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు సంబంధించి ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. మాటల మాంత్రికుడు తన సొంత గూడు లాంటి హారిక అండ్ హాసిని, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంపౌండ్‌ను వీడుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. నిర్మాత చినబాబు (రాధాకృష్ణ), నాగవంశీలతో త్రివిక్రమ్‌కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ బలమైన బంధం మధ్య మనస్పర్థలు వచ్చాయని, గురూజీ ఇకపై డీవీవీ (DVV) బ్యానర్ వైపు అడుగులు వేస్తున్నారంటూ పుకార్లు వినిపించాయి.

వివరాలు

'గాడ్ ఆఫ్ వార్'పై అభిమానుల్లో ఆందోళన

ఈ ప్రచారం తారక్ అభిమానుల్లో గుబులు రేపింది. ఎందుకంటే, త్రివిక్రమ్-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం 'గాడ్ ఆఫ్ వార్' పరిస్థితి ఏంటనే ప్రశ్న అందరినీ వేధించింది.

బ్యానర్‌కు సంబంధించిన విభేదాల కారణంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను పక్కన పెడతారా? అసలు సినిమా ఆగిపోతుందా? అంటూ నందమూరి అభిమానులు ఆందోళన చెందారు.

సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై రకరకాల చర్చలు జరిగాయి.

వివరాలు

ఒక్క ఫోటోతో రూమర్లకు చెక్

అయితే, ఈ ఊహాగానాలకు నిర్మాత నాగవంశీ తనదైన శైలిలో ఫుల్‌స్టాప్ పెట్టారు. ఎలాంటి ప్రెస్‌మీట్లు నిర్వహించకుండా, పెద్ద పెద్ద ప్రకటనలు చేయకుండా.. కేవలం ఒక్క ఫోటోతో ఈ ప్రచారానికి సమాధానమిచ్చారు.

నాగవంశీ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ప్రత్యేక ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఆ ఫోటోలో నిర్మాత చినబాబు, జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నందమూరి కల్యాణ్ రామ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తున్నారు.

ఈఒక్క ఫోటోతో ఇన్నాళ్లూ చక్కర్లు కొట్టిన రూమర్లన్నీ ఉత్త పుకార్లేననే సంకేతాలు ఇచ్చారు.

హారిక అండ్ హాసిని కాంపౌండ్‌తో త్రివిక్రమ్ బంధం చెక్కుచెదరలేదని, ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోయే 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదని నాగవంశీ చెప్పకనే చెప్పినట్లయింది.

ADVERTISEMENT