LOADING...
Mega #158 : బాబీ-చిరు కాంబోలో సర్‌ప్రైజ్ జోడీ.. మెగాస్టార్ సరసన నేషనల్ అవార్డ్ విన్నర్!
బాబీ-చిరు కాంబోలో సర్‌ప్రైజ్ జోడీ.. మెగాస్టార్ సరసన నేషనల్ అవార్డ్ విన్నర్!

Mega #158 : బాబీ-చిరు కాంబోలో సర్‌ప్రైజ్ జోడీ.. మెగాస్టార్ సరసన నేషనల్ అవార్డ్ విన్నర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 31, 2026
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ ఊపును ఏమాత్రం తగ్గించకుండా దూసుకుపోతున్నారు. ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలై భారీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో మరోసారి తన సత్తా చాటిన చిరు, ఇప్పుడు తన 158వ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించనుండగా, అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా తండ్రి-కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో సాగనున్న కథగా రూపొందుతోంది. ఇందులో చిరంజీవికి కూతురిగా యంగ్ బ్యూటీ కృతి శెట్టి నటించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Details

ఈ ప్రాజెక్టుపై మరింత క్రేజ్

'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడం ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్‌ను తెచ్చింది. అంతేకాదు, ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం మరో ప్రధాన ఆకర్షణగా మారింది. KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా షూటింగ్ మార్చి నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలొనిపిస్తున్నాయి.

Details

పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటన

ఇదిలా ఉండగా, తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా జాతీయ అవార్డు విజేత ప్రియమణి ఖరారైనట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ఇప్పటివరకు చిరంజీవి-ప్రియమణి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. దీంతో ఈ కొత్త జోడీపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. ఈ చిత్రంలో ప్రియమణి, చిరంజీవి భార్య పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, క్యాస్టింగ్‌పై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశముంది.

Advertisement