
Operation Valentine: రేపు పుల్వామా స్మారక ప్రదేశాన్ని సందర్శించనున్న ఆపరేషన్ వాలెంటైన్ బృందం
ఈ వార్తాకథనం ఏంటి
2019 పుల్వామా దాడితో దేశం ఒక్కసారి ఉలిక్కి పడింది.ఈ ఘటనతో ఒకేసారి 40 మంది జవాన్లను దేశం దూరం చేసుకుంది.
ఈ సంఘటన జరిగి రేపటికి 5 సంవత్సరాలు.ఈ సందర్భంగా వరుణ్ తేజ్ నటిస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ సినిమా టీమ్ అమరవీరులకు నివాళులర్పించాలని నిర్ణయించుకుంది.
ఈ దాడిలో వీరమరణం పొందిన అమరజవాన్లకు నివాళ్లు అర్పించడం కోసం,ఆపరేషన్ వాలెంటైన్ బృందం రేపు వారికి నివాళులర్పించేందుకు పుల్వామా స్మారక ప్రదేశాన్నిసందర్శించాలని నిర్ణయించింది.
వీరి పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
వరుణ్ తేజ్,మానుషి చిల్లర్ జంటగా నటించిన ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. ఆపరేషన్ వాలెంటైన్ కి మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ .
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆపరేషన్ వాలెంటైన్ బృందం చేసిన ట్వీట్
In a heartfelt tribute to the Heroes for their supreme sacrifice ❤️🔥
— Renaissance Pictures (@RenaissancePicz) February 13, 2024
Team #OperationValentine will visit the Pulwama memorial site Tomorrow, 14th FEB, to honour the eternal legacy of our brave soldiers 🇮🇳🙏#OPVonMarch1st@IAmVarunTej @ShaktipsHada89 @ManushiChhillar @dophari pic.twitter.com/cPuVbhh5SB