
allu arjun atlee movie: భారీ బడ్జెట్‌తో అల్లు అర్జున్- అట్లీ మూవీ?
ఈ వార్తాకథనం ఏంటి
'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ కొత్త సినిమాపై క్లారిటీ వచ్చింది. స్టార్ హీరో అల్లు అర్జున్ తదుపరి సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త.
తమిళ టాప్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ నటించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఈ విషయాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా వెల్లడిస్తూ, నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఒక ఆసక్తికరమైన వీడియోను విడుదల చేసింది.
వివరాలు
ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం
సన్ పిక్చర్స్ విడుదల చేసిన వీడియో ప్రకారం,ఈ ప్రాజెక్ట్‌ను అంతర్జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ కథకు భారీగా వీఎఫ్‌ఎక్స్ అవసరమైన కారణంగా,ఈ పని ఇప్పుడే ప్రారంభమైంది.
అల్లు అర్జున్,అట్లీ ఇటీవల అమెరికా వెళ్లి, లాస్ ఏంజెల్స్‌లోని వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలను సందర్శించి అక్కడి నిపుణులతో కథ పరిమాణం,అవసరమైన గ్రాఫిక్స్ గురించి చర్చించారు.
మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా అల్లు అర్జున్ ముఖాన్నిడిజిటల్‌గా మళ్లీ సృష్టించారు.
అలాగే కొన్ని సన్నివేశాలకు టెస్ట్ షూట్ కూడా పూర్తయింది.సినిమాను #AA22 పేరిట ఈఏడాది చివర్లో సెట్స్‌పైకి తీసుకెళ్లే ఉద్దేశ్యంతో చిత్ర బృందం పకడ్బందీగా ప్లానింగ్ చేస్తోంది.
అప్పటివరకు అల్లు అర్జున్‌కి కొత్త లుక్,మిగతా నటీనటుల ఎంపిక,సాంకేతిక నిపుణుల ఎంపిక వంటి పనులు పూర్తి చేయనున్నారు.
వివరాలు
మహేశ్-రాజమౌళి మూవీ తర్వాత..
'పుష్ప' ద్వారా దేశవ్యాప్తంగా మాస్ ఇమేజ్‌ను పొందిన అల్లు అర్జున్ ఇప్పుడు ఒక వినూత్న కథతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.
ఎమోషన్, మాస్ యాక్షన్‌ను సమపాళ్లలో మేళవించి కథను బలంగా చెప్పడంలో అట్లీకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఈ సినిమాలో కూడా అట్లీ శైలిని చూపించబోతున్నట్టు సమాచారం. మాస్ అంచనాల మధ్య ఈ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారు.
'పుష్ప 2' ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఈ నేపథ్యంలో #AA22పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
వివరాలు
భారత్‌లో అత్యంత ఖరీదైన సినిమా
ఈ హైప్‌కు తగినట్టుగానే ఈ సినిమాకు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించినట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
అల్లు అర్జున్ ఈ సినిమాకు రూ.175 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
అలాగే లాభాల్లో 15 శాతం వాటా కూడా ఉంటుందని సమాచారం.
దర్శకుడు అట్లీ రూ.100 కోట్లు తీసుకుంటున్నారని అంటున్నారు. అత్యధికంగా వీఎఫ్‌ఎక్స్ కోసం మాత్రమే సన్ పిక్చర్స్ రూ.250 కోట్లు వెచ్చిస్తున్నట్టు టాక్.
ప్రస్తుతం మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతోన్న #SSMB29కి రూ.1000 కోట్ల బడ్జెట్ ఉందని సినీ వర్గాల అంచనా.
దాంతో, ఆ ప్రాజెక్ట్ తర్వాత అల్లు అర్జున్ - అట్లీ సినిమా భారత్‌లో అత్యంత ఖరీదైన సినిమా కానుంది.