Loading...
Aakashamlo Oka Tara: 'ఆకాశంలో ఒకతార' రివ్యూ.. భార్య కల కోసం భర్త చేసిన పోరాటం
'ఆకాశంలో ఒకతార' రివ్యూ.. భార్య కల కోసం భర్త చేసిన పోరాటం

Aakashamlo Oka Tara: 'ఆకాశంలో ఒకతార' రివ్యూ.. భార్య కల కోసం భర్త చేసిన పోరాటం

వ్రాసిన వారు Balachander Sharma
Nov 20, 2026
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

కథలో భావోద్వేగం, భార్యాభర్తల అనుబంధం, మహిళా సాధికారతను కలిపి తెరకెక్కించిన చిత్రం 'ఆకాశంలో ఒకతార'. దుల్కర్‌ సల్మాన్‌, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు పవన్‌ సాధినేని దర్శకత్వం వహించారు. చిన్నప్పటి నుంచి వ్యోమగామి కావాలని కలలు కనే ఓ అమ్మాయి.. పరిస్థితుల కారణంగా చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఆమె కలను తన కలగా మార్చుకున్న భర్త, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాడు. ఈ ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులు, భావోద్వేగాలే సినిమా ప్రధాన కథాంశం.

Details

బాల్యపు కలకు పెళ్లి అడ్డంకి

పాలలంక గ్రామానికి చెందిన కల్పనకు చిన్నప్పటి నుంచే అంతరిక్షంపై ఆసక్తి. ఎప్పటికైనా వ్యోమగామి కావాలన్నది ఆమె ఆశయం.

కానీ తండ్రి నిర్ణయంతో పదో తరగతి పూర్తికాగానే కృష్ణతో ఆమెకు వివాహం జరుగుతుంది. పెళ్లి తర్వాత భార్య ఆశయం గురించి తెలుసుకున్న కృష్ణ.. ఆమె చదువును కొనసాగించి లక్ష్యాన్ని చేరుకునేలా చేయాలని నిర్ణయించుకుంటాడు.

కుటుంబ సభ్యుల వ్యతిరేకతను సైతం పట్టించుకోకుండా కల్పనను తీసుకుని హైదరాబాద్‌ వెళ్తాడు. అక్కడ ఆమె చదువుపై దృష్టి పెట్టగా, కుటుంబ బాధ్యతల కోసం కృష్ణ ఎన్నో త్యాగాలు చేస్తాడు.

Details

భార్య కోసం భర్త కష్టం

కష్టపడి చదివిన కల్పన ఐఐటీ ప్రవేశ పరీక్షలో ఏడో ర్యాంకు సాధిస్తుంది. ఆమెను కేరళలోని ఐఐటీ కళాశాలలో చేర్పించిన కృష్ణ.. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు గుజరాత్‌లోని బొగ్గు గనుల్లో డ్రైవర్‌గా పనిచేస్తాడు.

ఒకవైపు కృష్ణ డబ్బు సంపాదించేందుకు కష్టపడుతుంటే, మరోవైపు కల్పన తన లక్ష్యాన్ని చేరుకోవడానికి చదువులో ముందుకు సాగుతుంది.

ఈ క్రమంలో రాకెట్‌ స్పేస్‌కు సంబంధించిన ప్రయోగంలో ఆమెకు అవకాశం వస్తుంది.

అయితే ఆ ప్రయోగం విఫలమవడంతో పాటు కళాశాల నుంచి సస్పెన్షన్‌కు గురవుతుంది. అక్కడి నుంచి ఆమె జీవితంలో ఎదురైన పరిణామాలే కథను మరో మలుపు తిప్పుతాయి.

ADVERTISEMENT

Details

చివరి 20 నిమిషాలు అసలు బలం

కల్పన వ్యోమగామి కావాలన్న కల నెరవేరిందా? ఆమె కోసం కృష్ణ చేసిన త్యాగాలకు ఎలాంటి ఫలితం దక్కింది? ఈ ప్రయాణంలో రోహిణి (శ్రుతీ హాసన్‌), బిజిలి (రుహానీ శర్మ) పాత్రలు ఎలాంటి ప్రభావం చూపించాయి? అనే అంశాలతో సినిమా ముందుకు సాగుతుంది.

మొత్తం 159 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినా, భార్యాభర్తల మధ్య భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ముఖ్యంగా చివరి 20 నిమిషాలు హృదయాన్ని బరువెక్కిస్తాయి. ముందే ఊహించగలిగే కథ అయినప్పటికీ, భావోద్వేగ సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేయడం ఈ సినిమాకు ప్రధాన బలం.

ADVERTISEMENT