
Abhinayasri: 20 ఏళ్లు అయినా అదే జోష్ .. ఆర్య స్పెషల్ ఈవెంట్ లో అభినయశ్రీ
ఈ వార్తాకథనం ఏంటి
తాజాగా అభినయశ్రీ మళ్ళీ తెలుగు ఈవెంట్లో కనిపించింది.ఆర్య సినిమా రిలీజయి 20 ఏళ్ళు అవడంతో ఓ స్పెషల్ ఈవెంట్ ని నిర్వహించగా మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు.
ఈఈవెంట్ కి అభినయశ్రీ కూడా వచ్చింది.ఈసందర్భంగా మాట్లాడుతూ.. ఈపాట నాకు లైఫ్ లో ఒక పెద్ద గిఫ్ట్.
వేరే ఏదో షూట్ లో ఉంటే శంకర్ మాస్టర్ ద్వారా ఈ పాటకి డ్యాన్సర్ ని చూస్తున్నారని తెలిసి నాకు అఫర్ వచ్చింది.
ఆరు రోజులు షూట్ చేసాము ట్రైన్ మీద 3గంటలకు పొద్దున్నే లేచి ఆరు గంటలకి రెడీగా ఉండే వాళ్ళం.
ట్రైన్ 6గంటలకు వచ్చేది. సరైన నిద్ర, ఫుడ్ లేదు ఆ ఆరు రోజులు.కానీ లైఫ్ టైం గుర్తుండిపోయే సాంగ్ వచ్చిందని తెలిపారు.
Details
ఆ అంటే అమలాపురం.. సాంగ్ తో ఫుల్ పాపులర్
ఆర్య(Arya) సినిమా సాంగ్స్ చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పటికి ఆ పాటలు వింటూనే ఉంటాం .
అందులో ఆ అంటే అమలాపురం.. సాంగ్ అయితే స్పెషల్ సాంగ్స్ లో ఓ ట్రెండ్ సెట్ చేసింది.
ఈ సాంగ్ లో అభినయశ్రీ నటించింది. తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో స్పెషల్ సాంగ్స్ తో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అభినయశ్రీ.
ఆర్య సినిమాలో ఆ అంటే అమలాపురం.. సాంగ్ తో ఫుల్ పాపులర్ అయింది.
మరో సారి 20 ఏళ్ళ తర్వాత స్టేజి పై ఆ అంటే అమలాపురం.. సాంగ్ కి డ్యాన్స్ కూడా వేసి అలరించింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో కనిపిస్తోంది.