Samantha: నటనా నా ఫస్ట్ లవ్.. ఇక నుంచి విరామం లేదు! : సమంత
ఈ వార్తాకథనం ఏంటి
తమిళం, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న స్టార్ నటి సమంత. కొంతకాలంగా కష్టకాలాన్ని ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే.
నాగ చైతన్యతో విడాకుల అనంతరం కొద్దికాలంలోనే మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ సినిమాలకు విరామం తీసుకుంది.
ఈ పరిస్థితి నుంచి కోలుకునే క్రమంలోనే తన తండ్రి జోసెఫ్ ప్రభు అనూహ్యంగా మృతిచెందడం, అలాగే తన మాజీ భర్త నాగ చైతన్య రెండో వివాహం చేసుకోవడం సమంతను మానసికంగా ప్రభావితం చేశాయి.
అయితే ఈ ఆవేదన నుంచి బయటపడుతూ మళ్లీ తన కెరీర్‌పై దృష్టిపెట్టింది.
వరుణ్ ధావన్‌తో కలిసి 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్‌సిరీస్‌లో నటించిన సమంత, ప్రస్తుతం రాజ్, డీకే దర్శకత్వంలో రూపొందుతోన్న 'రక్త్ బ్రహ్మాండ్' వెబ్‌సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటోంది.
Details
సినిమాలకు దూరంగా ఉండే ఆలోచన లేదు
విరామం తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం గురించి సమంత స్పందిస్తూ ఇకపై నటనకు విరామం తీసుకోనని లేదని స్పష్టం చేసింది.
'నటన తన మొదటి ప్రేమ అని, ఇప్పటివరకు చాలా గ్యాప్ ఇచ్చానని చెప్పారు. ఇకపై సినిమాలకు దూరంగా ఉండే ఆలోచన లేదన్నారు.
వరుస ప్రాజెక్టులతో ముందుకొస్తానని సమంత ప్రకటించింది. ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్' పూర్తి చేసే పనిలో ఉన్నానని, మరో కొత్త సినిమా కూడా రెండు నెలల్లో ప్రారంభమవుతుందని వెల్లడించింది.
ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి' చిత్రంలో నటించిన సమంత, ఆ సినిమా తర్వాత తెలుగులో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.
ప్రస్తుతం వెబ్‌సిరీస్ షూటింగ్‌తో బిజీగా ఉంటూనే, త్వరలోనే కొత్త సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది.