Ravi Teja : షూటింగ్‌లో రవితేజకు గాయం.. శస్త్ర చికిత్స చేసిన వైద్యులు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 23, 2024
05:51 pm
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజ్ రవితేజ గాయపడినట్లు సినీ వర్గాలు తెలిపారు. తన 75వ సినిమాలో షూటింగ్‌లో ఉండగా తన కుడిచేతికి గాయమైంది. ఇక ఆయన్ను యశోద ఆస్పత్రికి తరలించగా, వైద్యులు శస్త్ర చికిత్స చేసినట్లు తెలిసింది. రవితేజ కోలుకునేందుకు కనీసం ఆరు నెలలు పడుతుందని వైద్యులు సూచించారట. ప్రస్తుతం రవితేజ విశ్రాంతి తీసుకుంటున్నట్లు సన్నిహితులు తెలిపారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుతున్నారు. R75 చిత్రాన్ని భాను భోగవరపు తెరకెక్కిస్తున్నారు.