Page Loader
Actor Shreyas Talpade: నటుడు శ్రేయాస్ తల్పాడే కి గుండెపోటు 
Actor Shreyas Talpade: నటుడు శ్రేయాస్ తల్పాడే కి గుండెపోటు

Actor Shreyas Talpade: నటుడు శ్రేయాస్ తల్పాడే కి గుండెపోటు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 15, 2023
08:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే (47)(Shreyas Talpade) గురువారం సాయంత్రం గుండెపోటుకు గురయ్యారు. సినిమా షూటింగ్ సమయంలో హార్ట్ ఎటాక్ రావడంతో ముంబైలోని అంధేరీ ప్రాంతంలోని బెల్లేవ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శ్రేయాస్ కు యాంజియోప్లాస్టీ చేశారు.ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. శ్రేయాస్ సినిమాలోకి రాకముందు మరాఠీ టీవీ షోలలో హోస్ట్ గా వ్యవహరించారు. గోల్'మాల్ సిరీస్, గ్రాండ్ మస్తీ,ఓం శాంతి ఓం, కౌన్ ప్రవీణ్ తాంబే వంటి చిత్రాలలో ఆయన నటించారు.యాక్టింగ్ తో బాటు డబ్బింగ్ ఆర్టిస్ గా కూడా శ్రేయాస్ మెప్పించారు. పుష్ప హిందీ వెర్షన్ లో అల్లు అర్జున్ కి శ్రేయాస్ డబ్బింగ్ చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శ్రేయాస్ తల్పాడే కి గుండెపోటు