
Vijay Kanth: మళ్లీ ఆస్పత్రిలో చేరిన నటుడు విజయ్ కాంత్
ఈ వార్తాకథనం ఏంటి
సినీ నటుడు, డీఎండీకె అధినేత విజయ్ కాంత్(Vijay Kanth) మరోసారి ఆస్పత్రిలో చేరారు.
ఆయన ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశార్జ్ అయిన విషయం తెలిసిందే.
అయితే విజయ్ కాంత్ మరోసారి ఆస్పత్రికి వెళ్లింది రెగ్యులర్ చెకప్ కోసమేనని, రెండ్రోజుల్లో తిరిగి ఇంటికి చేరుతారని కుటుంబ సభ్యులు తెలిపారు.
చైన్నైలోని మియత్ ఆస్పత్రిలో 20 రోజులు చికిత్స పొందారు. ఇటీవల ఆయన డిశార్జ్ అయ్యి ప్రజలు ముందుకొచ్చారు.
అయితే మరోసారి విజయ్ కాంత్ ఆస్పత్రిలో చేరడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Details
2015లో డీఎండీకే పార్టీని స్థాపించిన విజయ్ కాంత్
70 సంవత్సరాల విజయ్ కాంత్ గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.
ఆయనకు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులున్నారు.
తమిళంలో వందలాది సినిమాల్లో నటించి స్టార్ హీరోగా విజయ్ కాంత్ గుర్తింపు పొందారు.
కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో ఆయన స్టార్ హీరోల సరసన చేరారు.
2015లో దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం(డీఎండీకే) పేరుతో పార్టీని స్థాపించారు.