LOADING...
Madras High Court: లైకా కేసు: విశాల్‌ను దివాలా తీశారని ప్రకటించేందుకు సిద్ధమా?.. న్యాయవాదిని ప్రశ్నించిన మద్రాస్‌ హైకోర్టు
న్యాయవాదిని ప్రశ్నించిన మద్రాస్‌ హైకోర్టు

Madras High Court: లైకా కేసు: విశాల్‌ను దివాలా తీశారని ప్రకటించేందుకు సిద్ధమా?.. న్యాయవాదిని ప్రశ్నించిన మద్రాస్‌ హైకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2025
08:48 am

ఈ వార్తాకథనం ఏంటి

నటుడు విశాల్‌ తనను ధనవంతుడు కాదని ప్రకటించిన నేపథ్యంలో, ఆయనను దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించడానికి సిద్ధమా అని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. లైకా సంస్థకు బాకీగా ఉన్న రూ.21.29 కోట్లను 30 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను విశాల్‌ అప్పీల్‌ చేశారు. ఆ అప్పీల్‌పై సోమవారం జస్టిస్‌ ఎస్‌ఎం సుబ్రహ్మణ్యం,జస్టిస్‌ ముహమ్మద్‌ షఫీక్‌లతో కూడిన బెంచ్‌ విచారణ జరిపింది. విచారణలో,కోర్టు చెప్పిన కనీస మొత్తాన్ని అయినా డిపాజిట్‌ చేయలేరా అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. 30శాతం వార్షిక వడ్డీ విధించడం చట్టసమ్మతం కాదని, ఆ వడ్డీ మొత్తం మాత్రమే ఇప్పుడు రూ.40 కోట్లకు పైగానే ఉండొచ్చని విశాల్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది బెంచ్‌ దృష్టికి తీసుకువచ్చారు.

వివరాలు 

సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై మధ్యంతర స్టే 

విశాల్‌ లైకా చెబుతున్నంతగా ధనవంతుడు కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. అంతట న్యాయమూర్తులు జోక్యం చేసుకొని, "అయితే విశాల్‌ను దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా?" అని ప్రశ్నించారు. 30 శాతం వడ్డీ అనేది అత్యధికమని, ఈ విధంగా ఎవరి మీదైనా భారాన్ని మోపే చర్యలను కోర్టు అంగీకరించబోదని వ్యాఖ్యానించారు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన వడ్డీతో సహా చెల్లించాలన్న ఉత్తర్వులపై మధ్యంతరంగా స్టే విధించారు. ఇదే సమయంలో, రూ.10 కోట్లు ముందుగా డిపాజిట్‌ చేయాలని విశాల్‌కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, లైకా సంస్థ ఈ పిటిషన్‌పై తమ సమాధానం ఇవ్వాల్సి ఉన్నందున, విచారణను మరో నాలుగు వారాలకు వాయిదా వేశారు.

వివరాలు 

ఒప్పందం ఉల్లంఘనపై ఆరోపణలు 

విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో నిర్మిస్తున్న సినిమాల కోసం విశాల్‌ గోపురం ఫిలిమ్స్‌కు చెందిన అన్బుచెళియన్‌ నుంచి రూ.21.29 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ అప్పును లైకా సంస్థ విశాల్‌ తరపున చెల్లించగా, ఈ మొత్తం తిరిగి చెల్లించే వరకు విశాల్‌ నిర్మాణ సంస్థ ద్వారా తయారయ్యే అన్ని సినిమాల హక్కులను లైకా పొందుతుందని ఒప్పందం కుదిరింది. అయితే ఆ ఒప్పందాన్ని పాటించకుండానే విశాల్‌ కొత్త సినిమాలను విడుదల చేశారని ఆరోపిస్తూ, లైకా మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో, సింగిల్‌ జడ్జి విశాల్‌ లైకాకు రూ.21.29 కోట్లను 30 శాతం వడ్డీతో కలిసి చెల్లించాలని ఆదేశించారు.