Page Loader
Vishwak Sen : విశ్వక్‌సేన్‌కు గాయం.. 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' సెట్‌లో ఎం జరిగిందో తెలుసా
గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' సెట్‌లో ఎం జరిగిందో తెలుసా

Vishwak Sen : విశ్వక్‌సేన్‌కు గాయం.. 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' సెట్‌లో ఎం జరిగిందో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 15, 2023
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ యువ హీరో విశ్వక్‌సేన్‌ తాజా చిత్రం 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే యాక్షన్ సన్నివేశాల కోసం ప్రాక్టీస్‌ చేస్తోన్న సమయంలో విశ్వక్ గాయాలబారిన పడినట్లు తెలుస్తోంది. ఫైటింగ్‌ సీన్స్‌ రిహార్సిల్ చేస్తుండగా ప్రమాదవశాత్తు లారీపై నుంచి జారీ కిందపడ్డారని తెలుస్తోంది. దీంతో ఆయన కాలికు గాయమైంది. అయితే ఈ ఘటన కొద్దిరోజుల క్రితం జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం సేన్ కోలుకుని తిరిగి షూట్‌లో పాల్గొంటున్నారని టాక్. ఇదే సమయంలో ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా వైరల్ అవుతున్నాయి. కానీ ప్రమాదం ఎప్పుడు జరిగిందో స్పష్టత రాలేదు.

details

 గోదావరి నదీ కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతోన్న గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి

కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి', గోదావరి నదీ కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో యాక్షన్‌, వినోదం నిండిన స్టోరీతో చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్, పూర్తి మాస్‌ గెటప్‌లో కనిపించనున్నారు. నేహాశెట్టి హీరోయిన్‌గా సేన్ జోడిగా అదరగొడుతున్నారు. ఇప్పటికే పాటను విడుదల చేయగా ట్రెండ్‌ సెట్ చేస్తోంది. డిసెంబర్‌ 8న సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. తాజాగా ఈ చిత్ర విడుదలపై సేన్‌ స్పందించారు. ఈ మేరకు డిసెంబర్‌ 8న గంగమ్మతల్లిపై నా ఒట్టు, మహాంకాళి మాతో ఉంది అంటూ టాకీసుల్లోకి సినిమా రానుంది. డిసెంబర్‌లో ఈ సినిమా రిలీజ్ కాకుంటే ఇకపై నన్ను ప్రమోషన్స్‌లో చూడరని విశ్వక్ సేన్ ధీమా వ్యక్తం చేశారు.