Page Loader
Hema Chaudhary: ఐసీయూలో ప్రముఖ నటి హేమ చౌదరి.. ఆరోగ్యం విషమం
ఐసీయూలో ప్రముఖ నటి హేమ చౌదరి.. ఆరోగ్యం విషమం

Hema Chaudhary: ఐసీయూలో ప్రముఖ నటి హేమ చౌదరి.. ఆరోగ్యం విషమం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 20, 2023
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ సీనియర్ నటి హేమా చౌదరి (Hema Chaudhary) ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంలో బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 68 ఏళ్ల హేమా చౌదరి గత కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమెకు ఐసీయు(ICU)లో చికిత్స అందిస్తున్నారు. టాలీవుడ్, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో హీరోయిన్‌గా, సహాయ నటిగా ఆమె 180 పైగా సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, కమల్ హాసన్, రాజకుమార్, విష్ణువర్ధన్, మోహన్ బాబు వంటి హేమాహేమీలతో కలిసి నటించారు.

Details

1975లో సినీ రంగ ప్రవేశం చేసిన హేమా చౌదరి

తెలుగులో సుందరకాండ, ప్రేమ విజేత, పుట్టింటికి రా చెల్లి, గోరింటాకు వంటి చిత్రాల్లో నటించింది. సువర్ణ రత్న అవార్డు, సువర్ణ పరివార్ పాపులర్ స్టార్ సహా ఆమో ఎన్నో అవార్డులను అందుకుంది. 1975లో ఈకాలం దంపతుల అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి సౌత్‌లోని అన్ని భాషల్లో నటించి మెప్పించింది. హైదరాబాద్‌లో జన్మించిన హేమా చౌదరి అసలు పేరు దుర్గాప్రభ. ఆమె త్వరగా కోలుకోవాలని సినీప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.