
Malaika Arora : టెర్రస్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటి తండ్రి
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ రోజు ఉదయం, ముంబై సిటీ బాంద్రాలోని ఆయన నివాస బిల్డింగ్ టెర్రస్ పైకి వెళ్లి, అక్కడి నుంచి కింద దూకి చనిపోయారు.
అనిల్ అరోరా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆయన్ని చికిత్స కోసం తీసుకెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే మలైకా అరోరా, ఇతర కుటుంబ సభ్యులు వెంటనే ఇంటికి చేరుకున్నారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు అనారోగ్యమేనా లేక ఇతర కారణాలున్నాయా అనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.
మలైకా అరోరా, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ మాజీ భార్య.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మలైకా ఇంటికి చేరుకున్న అర్బాజ్ ఖాన్
#JUSTIN : Arbaaz Khan reached at malaika's mother house after demise of Malaika's Father#MalaikaArora #AnilArora #Suicide #ArbaazKhan pic.twitter.com/1jKxiXT9Sy
— upuknews (@upuknews1) September 11, 2024