LOADING...
Mumait Khan: 15 రోజులు కోమా.. నాలుగేళ్ల నరకయాతన.. ముమైత్ ఖాన్ షాకింగ్ లైఫ్ స్టోరీ!
15 రోజులు కోమా.. నాలుగేళ్ల నరకయాతన.. ముమైత్ ఖాన్ షాకింగ్ లైఫ్ స్టోరీ!

Mumait Khan: 15 రోజులు కోమా.. నాలుగేళ్ల నరకయాతన.. ముమైత్ ఖాన్ షాకింగ్ లైఫ్ స్టోరీ!

వ్రాసిన వారు Moogati Shabari
May 28, 2026
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ముమైత్ ఖాన్ పేరు ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో క్రేజ్ సంపాదించింది. కుర్రాళ్లకు కలల రాణిలా మారిన ఈ భామ, ఐటమ్ సాంగ్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అందం, ఎనర్జీతో స్టెప్పులు వేసిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాలో ఐటమ్ సాంగ్ అంటే ముమైత్ ఖాన్ ఉండాల్సిందే అన్నంత స్థాయికి ఆమె పేరు చేరింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లోనూ ఐటమ్ సాంగ్స్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కూడా నటించింది.

వివరాలు

జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఘటన..

అయితే గత కొంతకాలంగా ఆమె సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. మధ్యలో తెలుగు బిగ్ బాస్ షోలో మాత్రం సందడి చేసింది. ఇదే సమయంలో ఆమె గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ప్రమాదం గురించి, దాని తర్వాత ఎదుర్కొన్న కష్టాల గురించి వెల్లడించిన విషయాలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఆమె చెప్పిన వివరాల ప్రకారం, ఒక రోజు స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత పాడుకుంటూ అద్దం దగ్గరకు వెళ్లే సమయంలో అనుకోకుండా ఇటాలియన్ బెడ్‌కు బలంగా ఢీకొని పడిపోయిందట. ఆ బెడ్ పదునుగా ఉండటంతో ఆ దెబ్బ తీవ్రంగా తగిలింది. అదే ఘటన బ్రెయిన్ హీమరేజ్‌కు కారణమైందని ఆమె చెప్పింది.

వివరాలు

మరింత క్షీణించిన ఆరోగ్యం..

మెదడులో మూడు రోజుల పాటు రక్తస్రావం జరిగినా, ఆ విషయం తనకు అప్పుడు తెలియలేదని ఆమె వివరించింది. "నిజం చెప్పాలంటే నేను 15 రోజులు కోమాలో ఉన్న తర్వాత లేచినప్పుడు, అది మరుసటి రోజు అనుకున్నాను" అని ఆమె గుర్తుచేసుకుంది. ఆరోజుల్లో మొదట ఆరోగ్యం బాగోలేకపోతున్నప్పుడు, తల్లికి "అమ్మా, హాస్పిటల్‌కు తీసుకెళ్లండి, నాకు బాగోలేదు" అని చెప్పినప్పటికీ, జ్వరం లేకపోవడంతో తొలుత పెద్దగా పట్టించుకోలేదట. కానీ మూడో రోజు పరిస్థితి తీవ్రంగా క్షీణించడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ ఐసీయూలో చేర్చారని తెలిపింది.

Advertisement

వివరాలు

15 రోజుల పాటు కోమాలోనే..

ముమైత్ ఖాన్ 15 రోజుల పాటు కోమాలో ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆమె కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. తన తల్లి కన్నీరు పెట్టుకోకుండా, "నా కూతురు బతికితేనే నమ్ముతాను" అంటూ దేవుడిని ప్రార్థించినట్లు ముమైత్ చెప్పింది. ఈ సంఘటన తల్లి ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఆమెకు బీపీ, డయాబెటిస్, థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చాయని వెల్లడించింది. అంతేకాదు, ఆ సమయంలో 32 ఏళ్ల వయస్సులో ఉన్న తన తండ్రి కూడా మొదటిసారి కన్నీరు పెట్టుకున్నారని ఆమె తెలిపింది.

Advertisement

వివరాలు

నాలుగేళ్లు నరకం..

తర్వాత కోలుకున్నప్పటికీ, వైద్యులు ఆమెకు ఏడు సంవత్సరాల పాటు పనికి దూరంగా ఉండాలని సూచించారట. చిన్నప్పటి నుంచే మైగ్రేన్ సమస్య ఉండటం, సీజర్ అటాక్స్ కారణంగా తీసుకున్న మందులతో బరువు పెరగడం వంటి సమస్యలతో నాలుగేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె చెప్పింది. ఇలా తన జీవితంలో అత్యంత కఠినమైన నాలుగేళ్లను గడిపానని ముమైత్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement