Actress Thamanna-IPL Streaming Case: షూటింగ్ ఉంది...విచారణకు రాలేను: సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపిన తమన్నా భాటియా
ఐపీఎల్ (IPL) కాపీరైట్ కేసులో హీరోయిన్ తమన్నా భాటియా (Thamanna )సోమవారం మహారాష్ట్ర సైబర్ పోలీస్ (Ciber Police)కార్యాలయంలో విచారణకు హాజరు కాలేదు. షూటింగ్ కు సంబంధించి నగరానికి వెలుపల ఉన్న కారణంగా తమన్నా భాటియా విచారణకు హాజరు కాలేరని ఆమె తరపు లాయర్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపారు. ఈ కేసులో తమన్నా భాటియాను విచారించేందుకు సైబర్ పోలీసులు కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు. మహదేవ్ బెట్టింగ్ యాప్, ఫెయిర్ ప్లే వంటి యాప్ లు ఇండియన్ ప్రీమియం లీగ్ ఐపీఎల్ 2023 మ్యాచ్ లను చట్ట విరుద్ధంగా ప్రసారం చేశాయి. అయితే మహదేవ్ బెట్టింగ్ యాప్ ఫెయిర్ ప్లే యాప్ లకు తమన్నా భాటియా ప్రమోషన్స్ చేశారు.
ఇదే కేసులో సాహిల్ ఖాన్ అరెస్టు
దీంతో మహారాష్ట్ర సైబర్ పోలీసులు ఆమె స్టేట్మెంట్ను నమోదు చేసేందుకు సోమవారం రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో నటుడు సాహిల్ ఖాన్ ను అరెస్టు చేశారు. విచారించిన అనంతరం ఛత్తీస్గఢ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎక్కడికి తో పాటు రాపర్ బాదుషా వాల్ వాంగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డు చేశారు. దీంతోపాటు గతేడాది ఇదే కేసులో బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ లను కూడా విచారించారు.