Aditya 369 : మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆదిత్య 369 నిర్మాత..!
విభిన్న చిత్రాలను నిర్మించడంలో శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ ముందుంటారు. ఆదిత్య 369 వంటి సినిమాను నిర్మించి అప్పట్లో సంచలనం సృష్టించాడు. ఈ మధ్య అదే బ్యానర్‌లో వచ్చిన 'సమ్మోహనం' కూడా ప్రేక్షకులను మెప్పించింది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన ఆ సినిమా సుధీర్ బాబు కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. మరోసారి ఇదే కాంబో రిపీట్ కానుండడం విశేషం. గతంలో వీరిద్దరి కాంబో జెంటిల్ మెన్, సమ్మేహనం చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.
త్వరలోనే టైటిల్ అనౌన్స్‌మెంట్
తాజాగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తన వ్యక్తిగత 'ఎక్స్' ఖాతాలో గ్రహాల అనుగ్రహంతో మీ ముందుకు తెస్తున్న సినిమా టైటిల్‌ని త్వరలోనే 'దర్శి'ంగలరు సిద్ధంగా ఉండండి' అంటూ పోస్టు చేశాడు. అయితే ఈ సినిమాలో హీరోగా ప్రియదర్శి, హీరోయిన్‌గా రూపా కొడువాయూర్ నటించనున్నారు. చిత్రం టైటిల్ ను మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. మిగతా నటీనటులు, టెక్నిషియన్ల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని శివలెంక కృష్ణప్రసాద్ చెప్పారు.