Adivi Sesh New Movie: 'ది గర్ల్‌ఫ్రెండ్' డైరెక్టర్‌తో అడివి శేష్ కొత్త సినిమా.. త్వరలోనే అధికారిక ప్రకటన!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ హీరో అడివి శేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల 'డెకాయిట్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం 'గూఢచారి 2' (G2) చిత్రంలో నటిస్తున్నారు. 2018లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'గూఢచారి' సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హాష్మీ, వామికా గబ్బి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. రూ.100 కోట్ల బడ్జెట్‌తో 'జి2' 'గూఢచారి 2' చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు సమాచారం. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
'ది గర్ల్‌ఫ్రెండ్' దర్శకుడితో అడివి శేష్ సినిమా?
'జి2' షూటింగ్ పూర్తవుతున్న నేపథ్యంలో అడివి శేష్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం.
'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో ఆయన ఓ సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే అడివి శేష్, రాహుల్ రవీంద్రన్ మధ్య చర్చలు పూర్తయ్యాయని, శేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాలో నటించబోయే కథానాయిక ఎంపికపై చిత్ర బృందం దృష్టి పెట్టిందట.
హీరోయిన్‌ను ఖరారు చేసిన తర్వాత ఈ నెలాఖరులోనే నిర్మాణ సంస్థతో పాటు సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
వివరాలు
వైవిధ్యమైన కథలతో ప్రత్యేక గుర్తింపు
అడివి శేష్ 2002లో వచ్చిన 'సొంతం' చిత్రంలో కనిపించారు. అనంతరం 2010లో విడుదలైన 'కర్మ'తో నటుడిగా, దర్శకుడిగా పరిచయమయ్యారు.
ఆ తర్వాత 'పంజా' (2011), 'బలుపు' (2013), 'రన్ రాజా రన్' (2014), 'బాహుబలి: ద బిగినింగ్' (2015) చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.
హీరోగా 'క్షణం' (2016), 'గూఢచారి' (2018), 'ఎవరు' (2019), 'మేజర్' (2022), 'హిట్: ద సెకండ్ కేస్' (2022), 'డకోయిట్: ఎ లవ్ స్టోరీ' (2026) సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్.. ఈసారి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.