Page Loader
Adivi Shesh: కొత్త కథానాయికను ప్రకటించిన అడివి శేష్..త్వరలోనే పట్టాలెక్కనున్న కొత్త సినిమా
త్వరలోనే పట్టాలెక్కనున్న కొత్త సినిమా

Adivi Shesh: కొత్త కథానాయికను ప్రకటించిన అడివి శేష్..త్వరలోనే పట్టాలెక్కనున్న కొత్త సినిమా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 12, 2023
02:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ హీరో అడివి శేష్ తన కొత్త సినిమాలో హీరోయిన్'ను ప్రకటించేశారు. ఈ మేరకు కమల్ హాసన్ కుమార్తె, యంగ్ బ్యూటీ శృతి హాసన్'తో జోడి కట్టనున్నట్లు ట్వీట్ చేశారు. ఇక పేరు ఖరారు కానీ తన కొత్త సినిమా కోసం హీరోయిన్'గా శృతి హాసన్ నటించనున్నట్లు అడివి శేష్ వెల్లడించారు. దీంతో కొత్త చిత్రంపై అంచనాలు ప్రారంభమయ్యాయి. కథాంశం పరంగా శేష్, విభిన్న కథలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా అడవి శేష్ 'గూఢచారి 2' సినిమాలో నటిస్తున్నారు. గతంలో అడివి శేష్‌తో కలిసి 'క్షణం', 'గూడాచారి' వంటి చిత్రాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో తొలిసారిగా ఈ సినిమా కోసం మెగా ఫోన్ పట్టుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

త్వరలోనే జోడి కట్టనున్న అడివి శేష్, శృతి హాసన్