Page Loader
Sankranthiki Vasthunam ott: టీవీ తర్వాత ఓటీటీ - 'సంక్రాంతికి వస్తున్నాం' స్ట్రీమింగ్ డేట్ లాక్! 
టీవీ తర్వాత ఓటీటీ - 'సంక్రాంతికి వస్తున్నాం' స్ట్రీమింగ్ డేట్ లాక్!

Sankranthiki Vasthunam ott: టీవీ తర్వాత ఓటీటీ - 'సంక్రాంతికి వస్తున్నాం' స్ట్రీమింగ్ డేట్ లాక్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 27, 2025
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాధారణంగా ఓటిటిలో విడుదలైన తర్వాత టెలివిజన్‌లో సినిమాను ప్రసారం చేస్తారు. కానీ, దీనికి భిన్నంగా 'సంక్రాంతి వస్తున్నాం' చిత్రాన్ని మొదటగా ఓటీటీ కంటే ముందుగా జీ తెలుగు టెలివిజన్‌ ఛానల్‌లో ప్రసారం చేయాలని నిర్ణయించటం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే టెలివిజన్‌లో ప్రదర్శిస్తున్న ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్న వారికి జీ5 నుంచి అధికారిక అప్డేట్ వచ్చింది. మార్చి 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు జీ5 ఓటీటీ వేదికతో పాటు జీ తెలుగు ఛానల్‌లోనూ 'సంక్రాంతి వస్తున్నాం' స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు జీ5 యాప్‌లో విడుదల చేసిన కొత్త ప్రోమోలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

Details

అదనపు సీన్లు యాడ్

ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఫుల్ రన్‌లో **రూ.300 కోట్లు (గ్రాస్‌) పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. థియేటర్‌ నిడివిని తగ్గించడానికి అనిల్‌ రావిపూడి కొన్ని కామెడీ సన్నివేశాలను తొలగించాడని, ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌లో వాటిని మళ్లీ జోడించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా వెంకటేశ్‌, మీనాక్షి చౌదరి మధ్య ఫ్లాష్‌బ్యాక్‌ కామెడీ సీన్స్‌, అలాగే మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ల మధ్య మరికొన్ని సన్నివేశాలను కొత్తగా యాడ్ చేయనున్నట్లు టాక్. అయితే, టీమ్‌ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.