
ఓటీటీలోకి వచ్చేస్తున్న బేబి: స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
చిన్న సినిమాగా విడుదలైన బేబి, థియేటర్లలో పెద్ద సక్సెస్ అందుకుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది.
బేబి సినిమా ఓటీటీ విడుదల తేదీని ఈరోజు ప్రకటిస్తామని నిన్న ఆహా టీం అప్డేట్ ఇచ్చింది. అన్నట్లుగానే ఈరోజు బేబీ సినిమా స్ట్రీమింగ్ తేదీని వెల్లడి చేశారు.
ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఆగస్టు 25వ తేదీ నుండి బేబి సినిమా అందుబాటులో ఉండనుందని ఆహా టీం వెల్లడి చేసింది.
అయితే బేబి సినిమాను 12గంటల ముందుగానే చూడాలనుకుంటే ఆహా గోల్డ్ ప్లాన్ కి సబ్ స్క్రయిబ్ చేసుకోవాలని ఆహా తెలిపింది.
Details
బేబి సినిమా కథ ఏంటంటే
ఆటో నడుపుకునే ఆనంద్(ఆనంద్ దేవరకొండ), తన ఇంటి ముందు ఉన్న వైష్ణవి(వైష్ణవి చైతన్య) స్కూల్ డేస్ నుండి ప్రేమించుకుంటారు.
అయితే ఆనంద్ టెన్త్ పాస్ కాకపోవడంతో ఆటో నడుపుకుంటూ ఉంటాడు. వైష్ణవి ఇంజనీరింగ్ చదవడానికి కాలేజీలో జాయిన్ అవుతుంది. అక్కడ ఆమెకు విరాజ్(విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు.
విరాజ్ తో ఆమె చాలా స్నేహంగా ఉంటుంది. ఒకరోజు అనుకోకుండా పబ్ లో విరాజ్ ని వైష్ణవి ముద్దు పెట్టుకుంటుంది.
ఆ విషయం ఆనంద్ కి తెలిసిందా? తెలిసిన తర్వాత ఏమైంది? ఈ ప్రేమ కథలో వైష్ణవి మోసపోయిందా? తనని తాను మోసగించుకుందా అనే విషయాలు తెలియాలంటే బేబి సినిమా చూడాల్సిందే.
ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమాను దర్శకుడు సాయిరాజేష్ తెరకెక్కించారు.