Aishwarya Rai : ఈసారి రాధా రవి వంతు.. ఐశ్వర్య రాయ్‌ని రేప్ చేసేవాడ్ని.. వీడియో వైరల్
తమిళనాడులో నటుడు మన్సూర్ అలీఖాన్ హీరోయిన్ త్రిషపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దక్షిణాది సినీపరిశ్రమలో దుమారం రేపింది. అయితే ఇలాంటిదే గతంలోనూ జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఈ మేరకు ఒక ఈవెంట్లో ఐశ్వర్య రాయ్ మీద మాట్లాడిన వివాదస్పద వ్యాఖ్యలను ఓ గాయనీమణి మరోసారి గుర్తు చేస్తున్నారు. అయితే సదరు వీడియోలో ఒక వేళ తనకు హిందీ వచ్చి ఉంటే అంటూ సాగిన ఆ మాటలను సింగర్ చిన్మయి ప్రస్తావించింది.
రాధారవిపై చర్యలు లేవు ఎందుకు : సింగన్ చిన్మయ్
ప్రముఖ నటుడు రాధా రవి గతంలో చేసిన వ్యాఖ్యలను సింగర్ చిన్మయి మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. ఓ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటీమణి ఐశ్వర్య రాయ్ మీద చేసిన అసభ్యకరమైన మాటలు మరోసారి వైరల్ అవుతోంది. ఒక వేళ తనకు హిందీ వచ్చి ఉంటే ఐశ్వర్యా రాయ్‌ని రేప్ చేసి ఉండేవాడ్ని అని అనడం ప్రకంపణలు సృష్టించింది. అక్కడి వాళ్లు నాకు మంచి పాత్రలు ఎలాగూ ఇచ్చేవారు కాదు, రేప్ చేసే పాత్రలే వచ్చేవన్నారు. కానీ ఇప్పుడు మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యల మీద అంతా గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే మన్సూర్ మీద చర్యలు తీసుకుంటున్నారు. అయితే రాధా రవి మీద ఎటువంటి చర్యలు లేవెందుకు అని చిన్మయి నిలదీస్తున్నారు.