LOADING...
Ajay Devgan: ఫ్యూచర్ సిటీలో వరల్డ్-క్లాస్ ఫిల్మ్ సిటీకి అజయ్ దేవగణ్ గ్రీన్ సిగ్నల్
ఫ్యూచర్ సిటీలో వరల్డ్-క్లాస్ ఫిల్మ్ సిటీకి అజయ్ దేవగణ్ గ్రీన్ సిగ్నల్

Ajay Devgan: ఫ్యూచర్ సిటీలో వరల్డ్-క్లాస్ ఫిల్మ్ సిటీకి అజయ్ దేవగణ్ గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 02, 2025
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ సమ్మిట్‌లో భాగంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, హైదరాబాద్ శివారులోని భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీని స్థాపించేందుకు ముందుకొచ్చారు. ఈ నెల 8, 9 తేదీలలో జరిగే సదస్సులో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎంవోయూ (అవగాహన ఒప్పందం) కుదరనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Details

ఫ్యూచర్ సిటీలో రెండో ఫిల్మ్ సిటీ 

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న ఇది రెండో ఫిల్మ్ సిటీ. ఇప్పటికే మరో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు కూడా ఇక్కడ ప్రభుత్వం భూమిని కేటాయించింది. వినోద, పర్యాటక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే ఈ గ్లోబల్ సమ్మిట్ ముఖ్య లక్ష్యం. రిలయన్స్ భారీ ప్రాజెక్టులకు సిద్ధం ఈ సదస్సులో మరిన్ని ప్రముఖ పెట్టుబడుల ఒప్పందాలు కుదరకనున్నాయి. రిలయన్స్ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా వంతారా యానిమల్ రెస్క్యూ సెంటర్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేటరీ నైట్ సఫారీ

Details

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేసే అవకాశం

స్థాపనపై రిలయన్స్ ఆసక్తి చూపుతోంది. ఈ ప్రాజెక్టును ఫ్యూచర్ సిటీలోని 15,000 ఎకరాల అటవీ ప్రాంతంలో లేదా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేసే అవకాశముంది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర పర్యాటక రంగానికి భారీ ఉత్సాహాన్ని తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తుంది. రూ. 3,000 కోట్లతో ఫైవ్ స్టార్ స్థాయి హోటల్ నిర్మాణం అంతేకాకుండా, విలాసవంతమైన కేటరింగ్ సేవలలో పేరుగాంచిన ఫుడ్ లింక్ ఎఫ్ & బీ హోల్డింగ్స్ సంస్థ కూడా భారీ పెట్టుబడులతో ముందుకొచ్చింది. ఈ కంపెనీ రూ. 3,000 కోట్ల పెట్టుబడితో ఫ్యూచర్ సిటీలో మూడు స్టార్ హోటళ్లు నిర్మించేందుకు సిద్ధమైంది. దీకి సంబంధించిన ఒప్పందం కూడా ఇదే సమ్మిట్‌లో కుదరనుంది.

Advertisement