
Ajith Kumar: ఒళ్ళు గగ్గుర్పొడిచేలా అజిత్ కార్ ఆక్సిడెంట్
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోలలో అజిత్ కుమార్ ఒకరు.ఎంతటి డేంజరస్ స్టంట్ అయినా సరే డూప్ లేకుండా చేసేస్తారు.
ఈ క్రమంలో పలుసార్లు గాయపడ్డారు కూడా.తాజాగా అజిత్ 'విడాముయర్చి"అనే సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది.
అజిత్ కారును వేగంగా నడుపుకుంటూ వెళుతుండగా కాసేపటికి ఆ కారును ఆపేందుకు ప్రయత్నించారు.
కానీ, అది అదుపుతప్పి బోల్తా పడింది.అజిత్ నడుపుతున్న కారులోనే మరో నటుడు ఆరవ్ ఉన్నాడు.
అతడి చేతులు కట్టేసి మెడకు టేపుతో కట్టినట్లుగా కనిపిస్తుంది. విడుతల షూటింగ్ లో భాగంగా యాక్షన్ సీన్ జరుగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలను అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేనేజర్ సురేష్ చంద్ర చేసిన ట్వీట్
Vidaamuyarchi filming
— Suresh Chandra (@SureshChandraa) April 4, 2024
November 2023.#VidaaMuyarchi pic.twitter.com/M210ikLI5e