
Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమాలకు పాటు మోటారు రేసింగ్ పట్ల కూడా అపారమైన ఆసక్తి చూపుతారని చాలా మందికి తెలిసిందే.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన చిన్ననాటి జ్ఞాపకాలను షేర్ చేస్తూ రేసింగ్ పట్ల తనకున్న ప్రేమను, ఆ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను వెల్లడించారు.
రేసింగ్ నాకు ఎంతో ఇష్టమైనదైనా, అప్పట్లో ఆ హాబీకి అవసరమైన ఖర్చులను తల్లిదండ్రులు భరించలేకపోయారు. కానీ వారు నా ఇష్టాన్ని ఎప్పుడూ అడ్డుకోలేదు.
రేసింగ్ వైపు నా ఆసక్తిని గుర్తించి, మా నాన్న, అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి
Details
రెండింటికి సమన్యాయం
'ఇది చాలా ఖరీదైన ఆట. నేను ఆర్థికంగా సహాయం చేయలేను. కానీ నువ్వే స్పాన్సర్ల కోసం ప్రయత్నించు, మేము పూర్తిగా మద్దతు ఇస్తాం'. అలాగే డిగ్రీ పూర్తిచేయమన్నా, లేదా ఏదైనా పని చేస్తూ రేసింగ్ కొనసాగించమన్నారు.
అప్పుడు నేను రెండో ఆప్షన్‌ను ఎంచుకుని పని చేసుకుంటూ రేసింగ్ సాగించానని అజిత్ చెప్పారు.
తాజాగా తన కెరీర్‌పై అజిత్ స్పందిస్తూ, 'సినిమా, రేసింగ్ - రెండింటికీ సమానంగా న్యాయం చేయడం కష్టమైపోతోంది.
అందుకే రేసింగ్ సీజన్ ఉన్నప్పుడు సినిమాల నుంచి తానంతట తాను విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు.
Details
రేసింగ్ లోనూ రాణిస్తున్న అజిత్
రేసింగ్ విషయంలో అజిత్ ఇటీవలి సీజన్‌లో మంచి ఫలితాలను సాధించారు. జనవరిలో జరిగిన 24హెచ్ దుబాయ్ కారు రేసింగ్‌లో ఆయన టీమ్ మూడో స్థానం దక్కించుకుంది.
ఇటలీలో జరిగిన 12గంటల రేస్‌లోనూ మూడో స్థానం గెలుచుకున్నారు.
అంతేకాదు బెల్జియంలోని ప్రసిద్ధ స్పా-ఫ్రాన్‌కోర్‌ఛాంప్స్ సర్క్యూట్‌లో జరిగిన పోటీల్లో అజిత్ టీమ్ ద్వితీయ స్థానం సొంతం చేసుకుంది.