LOADING...
Akhanda 2: 'అఖండ 2' వాయిదా.. బాలకృష్ణ సమాధానం ఇదే!
'అఖండ 2' వాయిదా.. బాలకృష్ణ సమాధానం ఇదే!

Akhanda 2: 'అఖండ 2' వాయిదా.. బాలకృష్ణ సమాధానం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2025
03:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

'అఖండ 2' విడుదల ఆలస్యానికి గల కారణంపై నందమూరి బాలకృష్ణ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల్లో మరోసారి ఆసక్తి పెరిగింది. ఈ ప్రకటనతో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి. ముఖ్యంగా, 'అఖండ' చిత్రంలో థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజయంలో కీలక పాత్ర పోషించగా, ఈసారి కూడా అంతకు మించి అద్భుతమైన సౌండ్ అనుభూతిని అందించేందుకు ఆయన ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని బాలయ్య తెలిపారు. ఆలస్యం కారణంగా సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనులకు సమయమందడంతో పాటు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన *OG*తో నేరుగా బాక్సాఫీస్ క్లాష్ తప్పింది. దీంతో, ఇది కూడా 'అఖండ 2'కి అదనపు లాభంగా మారనుందని చిత్రబృందం నమ్ముతోంది.

Details

డిసెంబర్ 5న రిలీజయ్యే అవకాశం

ప్రస్తుతం డిసెంబర్ 5న రిలీజ్ చేయాలనే ప్రణాళికలు జరుగుతున్నాయి. ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' చిత్రం జనవరి 2026కి వాయిదా పడటంతో, డిసెంబర్‌లో 'అఖండ 2'కి ఏకపక్ష రాజ్యం దక్కే అవకాశం కనిపిస్తోంది. దర్శకుడు బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబోలో వస్తున్న నాలుగో చిత్రం ఇదే. ఇంతకు ముందు ఈ కాంబినేషన్‌లో వచ్చిన 'సింహా', 'లెజెండ్', 'అఖండ' సినిమాలు మొత్తం బ్లాక్‌బస్టర్స్ కావడంతో, ఈసారి అంచనాలు మరింతగా పెరిగాయి. అఖండ 2: తాండవంలో బాలయ్య మరోసారి అఘోరా పాత్రలో కనిపించనున్నారు. ఈ సారి హిమాలయాల నేపథ్యంలో భారీ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Details

విలన్ గా ఆది పినిశెట్టి

విలన్‌గా ఆది పినిశెట్టి, హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. అలాగే ప్రగ్యా జైస్వాల్, హర్షాలీ మల్హోత్రా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పట్ల అభిమానులు మాత్రమే కాదు, ట్రేడ్ వర్గాల్లో కూడా భారీగా అంచనాలున్నాయి. ఈ సినిమా గత రికార్డులను బద్దలు కొడుతూ, ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. డిసెంబర్‌లో 'అఖండ 2' బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందో చూడాలి.