Page Loader
'Akhanda 2': జార్జియాలో 'అఖండ 2' షెడ్యూల్.. షూటింగ్ సీన్ లీక్!
జార్జియాలో 'అఖండ 2' షెడ్యూల్.. షూటింగ్ సీన్ లీక్!

'Akhanda 2': జార్జియాలో 'అఖండ 2' షెడ్యూల్.. షూటింగ్ సీన్ లీక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2025
06:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం 'అఖండ 2 - తాండవం' గురించి సినీ అభిమానుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. సూపర్ హిట్ 'అఖండ'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన యూనిట్, తాజా షెడ్యూల్‌ కోసం జార్జియాకు వెళ్లింది. ఇందులో భాగంగా బాలకృష్ణపై భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నద్ధమవుతున్నారు.ఈ యాక్షన్ ఎపిసోడ్స్‌లో విదేశీ ఫైటర్స్ కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది. అయితే జార్జియాలో షూటింగ్ స్పాట్‌కి సంబంధించిన ఓ వీడియో తాజాగా లీక్ కావడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Details

సంగీత దర్శకుడిగా థమన్

భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా థమన్ పనిచేస్తుండగా, గత సినిమాల్లోలాగే ఈసారి కూడా అతడి మ్యూజిక్‌కి పెద్ద హైలైట్‌గా మారనుంది. బాలయ్యకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తుండగా, ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి కనిపించనున్నాడు. ఈ భారీ మాస్ ఎంటర్‌టైనర్‌ను ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే బాలయ్య - బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన 'సింహా', 'లెజెండ్', 'అఖండ' చిత్రాలు మాస్ ఆడియెన్స్‌ను ఊపేసిన నేపథ్యంలో 'అఖండ 2'పై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.