Page Loader
Chaitu Sobhita: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ పెళ్లి.. స్ట్రీమింగ్ రైట్స్ కు భారీ డిమాండ్
నాగ చైతన్య-శోభిత ధూళిపాళ పెళ్లి.. స్ట్రీమింగ్ రైట్స్ కు భారీ డిమాండ్

Chaitu Sobhita: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ పెళ్లి.. స్ట్రీమింగ్ రైట్స్ కు భారీ డిమాండ్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2024
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం కొన్ని నెలల క్రితం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ఇరు కుటుంబాలకు చెందిన కేవలం కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే పాల్గొన్నారు. ప్రస్తుతం, అక్కినేని కుటుంబ సభ్యులు వీరి వివాహ వేడుకను మరింత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభిత వివాహం జరగనుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల విశాఖపట్నంలో శోభిత నివాసంలో పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన పనులు ప్రారంభం కావడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. త్వరలోనే వీరి వివాహ తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

వివరాలు 

చైతన్య-శోభిత వివాహ స్ట్రీమింగ్ హక్కులు నెట్‌ఫ్లిక్స్ కే..

ఇక సినీ పరిశ్రమలో తాజాగా సెలబ్రిటీల వివాహ వేడుకలను ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లపై స్ట్రీమింగ్ చేయడం ట్రెండ్‌గా మారింది. గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, విగ్నేష్ శివన్ వివాహ వేడుకను నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో చైతన్య-శోభిత వివాహ స్ట్రీమింగ్ హక్కులు కూడా నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ డీల్ ఎంతకు కుదిరిందనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. అక్కినేని కుటుంబంలో జరుగబోయే ఈ గ్రాండ్ వివాహ వేడుకను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ వేడుకను ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.