
Akkineni Nagarjuna : నాగార్జున 100వ సినిమా ఎవరితో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ మన్మధుడు, కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి ఫామ్'లోకి వచ్చాడు. ప్రస్తుతం విజయ్ బిన్నీ దర్శకత్వంలో తన 99వ చిత్రం నా సామి రంగ షూటింగ్‌లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మేరకు త్వరలోనే షూట్ ముగియనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు తమిళ దర్శకుడు అనిల్‌తో నాగార్జున ఓ చిత్రాన్ని ఓకే చేశాడని సమాచారం. ఈ మేరకు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారని ప్రచారం ఊపందుకుంది.
100వ చిత్రం లవ్ యాక్షన్ రొమాన్స్ అనే టైటిల్ పెట్టినట్లు సినీ ప్రపంచంలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మించనున్న ఈ చిత్రంలో నాగార్జున యాక్షన్‌తో కూడిన పాత్రలో కనిపించనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రస్తుతం నా సామి రంగాలో నటిస్తున్న నాగార్జున
King of Romance!#Nagarjuna https://t.co/brKXZTGP1i pic.twitter.com/MDYk3nyIdg
— idlebrain jeevi (@idlebrainjeevi) December 4, 2023