టాలీవుడ్ లో రీ రిలీజుల పర్వం: అక్కినేని నాగార్జున మన్మథుడు సినిమా మళ్ళీ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ లో రిలీజ్ ల పర్వం కొనసాగుతోంది. హీరోల పుట్టినరోజులను పురస్కరించుకొని పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు.
తాజాగా అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు చిత్రం మళ్ళీ విడుదలకు సిద్ధమవుతోంది. 2002 డిసెంబర్ 20వ తేదీన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.
దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం, త్రివిక్రమ్ అందించిన కథ, మాటలు, విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను కుటుంబ ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు.
ప్రస్తుతం నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29వ తేదీన మన్మథుడు సినిమా మళ్లీ రిలీజ్ అవుతుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది.
ఈ సినిమాలో సోనాలి బింద్రే, అన్షు హీరోయిన్లుగా నటించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మన్మథుడు సినిమా మళ్ళీ విడుదలపై అన్నపూర్ణ స్టూడియోస్ ట్వీట్
On the occasion of 𝐊𝐈𝐍𝐆 @iamnagarjuna's birthday, re-releasing the magical classic #Manmadhudu on August 29th in Theatres ✨💫
— Annapurna Studios (@AnnapurnaStdios) August 16, 2023
Get ready to fall in love with him, all over again ❤️🔥@iamsonalibendre #KVijayaBhaskar #TrivikramSrinivas @ThisIsDSP #Anshu @adityamusic… pic.twitter.com/RaAuR0X2dy