
Alia Bhatt Deepfake Video : మరీ ఇంత నీచమా.. అలియా డీప్ ఫేక్ వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) కు డీప్ ఫేక్ వీడియో టాలీవుడ్‌లోనే కాదు, దేశ వ్యాప్తంగా ఎంత సంచనలమైందో అందరికీ తెలిసిందే.
ఈ వీడియోపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. సినీ తారలను టార్గెట్ చేసుకొని మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలతో తెగ ఇబ్బంది పెడుతున్నారు.
రష్మికా, కాజోల్ ఘటనలు ఇంకా మరవకముందే మరో టాప్ సెలబ్రెటీ డీప్ ఫేక్ ఫోటోలు వైరల్ కావడం గమానార్హం.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt ) ముఖంతో తన ముఖాన్ని మార్చుకున్న ఓ అమ్మాయి ఫోటోస్ సోషల్ మీడియా మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Details
అగ్రహం వ్యక్తం చేస్తున్న ఆలియా భట్ ఫ్యాన్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఆ యువతి ముఖాన్ని ఆలియా భట్‌గా మార్చేశారు.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి వీడియోలతో సినీతారాలతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులను భాదపెట్టడం ఎందుకని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఏదిఏమైనా ఇలాంటి ఘటనలపై గట్టి చర్యలు తీసుకోవాలని ప్రముఖులు కోరుతున్నారు.