
HHVM : పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ మాత్రమే మిగిలింది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వేదిక ఖరారేనా?
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పీరియాడికల్ చిత్రం 'హరిహర వీరమల్లు' విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 24న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదలైన 'హరి హర వీరమల్లు' థియేట్రికల్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అమితమైన స్పందన వచ్చింది. దాంతో సినిమా పట్ల అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
Details
ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం ప్లానింగ్ వేగం
విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ నెల 20న గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ వేడుకను ఎక్కడ నిర్వహించాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఓపెన్ గ్రౌండ్స్‌లో ఈవెంట్లకు అనుమతులు లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే దిశగా ఆలోచనలు మొదలయ్యాయి. తొలుత విజయవాడలో నిర్వహించాలన్న యోచన ఉన్నా, అక్కడ అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ప్లాన్ వాయిదా పడింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విశాఖపట్నం (వైజాగ్) వేదికగా ఈ ఈవెంట్‌ను నిర్వహించాలనే ఆలోచనకు టీం మొగ్గు చూపుతోంది.
Details
రెండు, మూడ్రోజుల్లో అధికారిక ప్రకటన
అయితే ఏ వేదికపై నిర్ణయం తీసుకోవాలన్నది పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే తేలనుంది. వైజాగ్ వేదికగా ఈవెంట్ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అదే కుదరకపోతే హైదరాబాద్‌లో ఓ ఇండోర్ లొకేషన్‌లో ఈ వేడుకను నిర్వహించే వీలుండొచ్చని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకో రెండు మూడు రోజుల్లో ఈ విషయంపై అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది.