LOADING...
Alcohol Teaser : 'తాగితే ఆల్క‌హాల్ న‌న్ను కంట్రోల్ చేస్తుంది.. అది నాకు న‌చ్చ‌దు'..అల్లరి నరేష్ 'ఆల్క‌హాల్' టీజ‌ర్‌ మీరు చూసేయండి.. 

Alcohol Teaser : 'తాగితే ఆల్క‌హాల్ న‌న్ను కంట్రోల్ చేస్తుంది.. అది నాకు న‌చ్చ‌దు'..అల్లరి నరేష్ 'ఆల్క‌హాల్' టీజ‌ర్‌ మీరు చూసేయండి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2025
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా 'ఆల్కహాల్'. ఈ చిత్రానికి మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లరి నరేష్ కెరీర్‌లో ఇది 63వ సినిమాగా రూపుదిద్దుకోగా, ఇందులో రుహాని శర్మ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం గిబ్రాన్ అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. "లక్షలు సంపాదిస్తావు కానీ మందు తాగవు.. ఇక ఎందుకు నీ బతుకు?" అంటూ సీరియస్ డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది.

వివరాలు 

టీజర్ చాలా ఎనర్జిటిక్‌గా, ఆకట్టుకునేలా..

"తాగుడికి సంపాదనకే సంబంధం ఉంది", "తాగితే ఆల్కహాల్ నన్ను కంట్రోల్ చేస్తుంది.. అది నాకు నచ్చదు" అని హీరో నరేష్ చెప్పే డైలాగ్‌లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మొత్తంగా టీజర్ చాలా ఎనర్జిటిక్‌గా, ఆకట్టుకునేలా ఉంది. టీజర్ చూస్తుంటే సినిమా ప్రధానంగా కామెడీ ఎంటర్టైనర్గా రాబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్