Page Loader
Allu Arjun: స్నేహారెడ్డికి ఎమోషనల్ గా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్
స్నేహారెడ్డికి ఎమోషనల్ గా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్

Allu Arjun: స్నేహారెడ్డికి ఎమోషనల్ గా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2024
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ యానివర్సరీ క్యూటీ. మన పెళ్లి అయ్యి 13 ఏండ్లయిపోయింది. నేను ఇలా ఉండటానికి నీతో బంధమే కారణం. నీ ప్రశాంతత నుంచి నాకు బోలెడంత శక్తిని ఇచ్చావ్. ఇలాంటి రోజులు నీతో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు. వీరి వివాహం 2011లో జరగగా,వీరికి ఇద్దరు(అయాన్, అర్హ) పిల్లలు ఉన్నారు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమా సీక్వెల్‌లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఆ సినిమా ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈచిత్రం ఆగస్ట్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది.ఇక సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అల్లు అర్జున్ పెళ్లిరోజు శుభాకాంక్షల ట్వీట్