LOADING...
Allu arjun: ఐకాన్ స్టార్ మూవీపై భారీ అప్‌డేట్.. ఏప్రిల్ 8న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Allu arjun: ఐకాన్ స్టార్ మూవీపై భారీ అప్‌డేట్.. ఏప్రిల్ 8న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

Allu arjun: ఐకాన్ స్టార్ మూవీపై భారీ అప్‌డేట్.. ఏప్రిల్ 8న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 13, 2026
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

'పుష్ప' విజయంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అల్లు అర్జున్ మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. వరుస విజయాలతో గుర్తింపు పొందిన దర్శకుడు అట్లీతో బన్నీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వస్తున్న సినిమా గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 'AA 22' అనే పేరుతో ఈ మూవీ షూట్ జరుగుతోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా చిత్రానికి సంబంధించిన టైటిల్ రివీల్ చేసే అవకాశం ఉంది. అలాగే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.

వివరాలు

ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్

అంతేకాకుండా గ్లింప్స్ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అదే రోజున విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో హీరో విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడనే ప్రచారం ఉంది. సాధారణంగా దర్శకుడు అట్లీ తన చిత్రాల్లో హీరోను పవర్ ఫుల్ గా చూపిస్తాడు. అందుకే ఇందులో హీరో లుక్ ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో కథానాయికగా దీపిక పదుకొనే నటిస్తుండగా సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. ఈ మూవీ 2027లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Advertisement