Pushpa The Rule: రూ.1000 కోట్ల క్లబ్‌లోకి' 'పుష్ప 2 ది రూల్'.. భారతీయ సినీ చరిత్రలో రికార్డు
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 'పుష్ప 2: ది రూల్' సినిమా హవా కొనసాగుతోంది. ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకెళ్ళి,తాజాగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. విడుదలైన 6 రోజుల్లోనే ఈ సినిమా రూ.1002 కోట్లు(గ్రాస్)వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్రం నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. 'బాహుబలి 2','ఆర్‌ఆర్‌ఆర్','కల్కి 2898 AD'వంటి భారీ వసూళ్ల సినిమాల తర్వాత ఇదే తెలుగు సినిమా ఇప్పుడు ఇంతటి ఘనత సాధించిందనేది విశేషం. ఇక, 6 రోజుల్లోనే రూ.1000 కోట్ల వసూళ్లు రాబట్టడం భారతీయ సినిమా చరిత్రలో ఒక రికార్డుగా నిలిచింది. 'పుష్ప 2' మొదటి రోజు అత్యధిక వసూళ్లను(రూ.294 కోట్లు)సాధించిన భారతీయ సినిమా గానూ రికార్డు సాధించింది.
గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్‌లో అల్లు అర్జున్ అదరహో
ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ తెరకెక్కించిన సినిమా 'పుష్ప: ది రైజ్' 2021లో విడుదలైంది. ఈ సినిమా దాని సీక్వెల్‌గా పుష్ప 2 రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమాకు భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ నటనను సినీ ప్రేమికులు, ప్రముఖులు అద్భుతంగా ప్రశంసిస్తున్నారు, ముఖ్యంగా గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్‌లో ఆయన ప్రదర్శనను అదరహో అంటూ కొనియాడుతున్నారు.