తదుపరి వార్తా కథనం

Allu Arjun : ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లిన అల్లు అర్జున్.. ఎందుకంటే?
వ్రాసిన వారు
Stalin
Mar 25, 2024
07:07 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే వైజాగ్, హైదరాబాద్‌లో పుష్ప 2: ది రూల్ షూటింగ్‌ను ముగించారు. ప్రస్తుతం విరామంలో ఉన్నారు.
ఈ రోజు, అయన తన భార్య అల్లు స్నేహ రెడ్డి, పిల్లలతో కలిసి దుబాయ్ వెళ్లారు. అయన దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవుతున్నారు.
ఈ లాంచ్ ఈవెంట్ గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అల్లు అర్జున్ దర్శకులు సందీప్ రెడ్డి వంగా , త్రివిక్రమ్ శ్రీనివాస్‌లతో నెక్స్ట్ సినిమాలు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ లపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విమానాశ్రయంలో అల్లు అర్జున్
AA family off to DUBAI
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) March 25, 2024
All set for Iconic Moment on 28th 🔥🤩@alluarjun @Tussauds_Dubai pic.twitter.com/dI5Y3wkh4h