Allu Arjun: అల్లు అర్జున్ మరో ఘనత.. 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' తొలి మ్యాగజైన్ కవర్‌పై బన్నీ
ఈ వార్తాకథనం ఏంటి
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో విశేషమైన గుర్తింపు సాధించారు.
ఈ సినిమా హాలీవుడ్‌ను కూడా ఆకర్షించడంతో,ఆయన గ్లోబల్ స్టార్‌గా మారారు.
తాజాగా, ఆయన ఖాతాలో మరో ప్రత్యేకమైన గౌరవం చేరింది.
ప్రపంచ ప్రఖ్యాత సినీ మ్యాగజైన్ 'ది హాలీవుడ్ రిపోర్టర్' ఇప్పుడు 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' పేరుతో భారత్‌లో తన సేవలను ప్రారంభించింది.
ఆసక్తికరంగా, ఈ మ్యాగజైన్ తొలి సంచిక కవర్ పేజ్‌కి అల్లు అర్జున్ ఫోటోను ఎంపిక చేశారు.
ఈ ప్రత్యేక కవర్ షూట్‌కు సంబంధించిన బీటీఎస్ ప్రోమో వీడియోను ఇటీవల విడుదల చేశారు.
ఇందులో అల్లు అర్జున్ పంచుకున్న ముఖ్యమైన విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.
వివరాలు
వినయంగా ఉండటం ఎంతో అవసరం
ఈ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తన అభిప్రాయాలను పంచుకుంటూ, "ఇండియన్ బాక్సాఫీస్‌లో తనకు వచ్చిన గుర్తింపు గొప్పదని, జీవితంలో లభించిన అతిపెద్ద అవకాశం ఇదే అని భావిస్తున్నా.బలం,ఆత్మవిశ్వాసం మనసులో నుంచే వస్తాయని, వాటిని ఎవరూ తీసుకోలేరని పేర్కొన్నారు.
జీవితంలో విజయవంతమైనా వినయంగా ఉండటం ఎంతో అవసరం అని చెప్పారు.
సినిమా చూస్తున్నప్పుడు తాను కూడా ఒక సామాన్య ప్రేక్షకుడిలా ఉంటానని, విరామ సమయాన్ని పూర్తి విశ్రాంతిగా గడపాలని ఇష్టపడతానని, ఏమీ చేయకుండా ఉండటమే తనకు నచ్చిన పని అని తెలిపారు.
ఈ ఇంటర్వ్యూలో 'పుష్ప 2' గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు సమాచారం.
వివరాలు
'సినిమాకు హద్దులు లేవని నిరూపించిన స్టార్ -
అల్లు అర్జున్: ది రూల్' అనే పేరుతో 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' ప్రత్యేక కథనాన్ని ప్రచురించనుంది.
ఇందులో అల్లు అర్జున్ ఇప్పటి వరకు సాధించిన విజయాలు, ఆయన సినీ ప్రయాణం, భవిష్యత్ ప్రాజెక్టులు ఉంటాయని తెలుస్తోంది.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప: ది రూల్' ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను విశేషంగా ఆకర్షించింది.
ఇప్పటి వరకు రూ.1,871 కోట్లు వసూలు చేసి, సినీ చరిత్రలో ఓ కొత్త రికార్డును సృష్టించింది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పూర్తి ఆర్టికల్ త్వరలో రానుంది.