తదుపరి వార్తా కథనం

Allu Arjun: హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 21, 2024
01:13 pm
ఈ వార్తాకథనం ఏంటి
సినీ హీరో అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నంద్యాలలో ఎన్నికల సమయంలో తనపై నమోదైన కేసును రద్దు చేయాలని ఆయన కోరారు.
సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 ప్రకారం అనుమతి లేకుండా సభలు నిర్వహించారని ఆరోపణలతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. దీనిపై అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, విచారణ జరపనుంది.
నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.