NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Pushpa 2: ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప 2 అరుదైన రికార్డు.. అదేంటంటే..?
    తదుపరి వార్తా కథనం
    Pushpa 2: ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప 2 అరుదైన రికార్డు.. అదేంటంటే..?
    ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప 2 అరుదైన రికార్డు.. అదేంటంటే..?

    Pushpa 2: ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప 2 అరుదైన రికార్డు.. అదేంటంటే..?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 22, 2024
    03:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం పుష్ప 2: ది రూల్ (Pushpa 2: The Rule).

    సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు 2024 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

    విడుదల తేదీ దగ్గరపడుతున్న వేళ, ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ నెట్టింట చర్చనీయాంశంగా మారుతోంది.

    ఇప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లో ఓ అరుదైన రికార్డు కోసం పుష్ప 2 కొత్తగా వార్తల్లోకెక్కుతోంది.

    తాజా సమాచారం ప్రకారం, వైజాగ్‌లోని సంగం శరత్ థియేటర్ వద్ద అల్లు అర్జున్‌కు అభిమానులు ఒక భారీ కటౌట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

    వివరాలు 

    ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద కటౌట్

    ఈ కటౌట్ 16×108 అడుగుల పొడవుతో ఉండేలా నిర్మిస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద కటౌట్ కావడం విశేషం.

    ఈ రికార్డు కటౌట్ అభిమానుల ఉత్సాహానికి ప్రతీకగా నిలవగా, దాన్ని చూడటానికి వీక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    సీక్వెల్‌లో కన్నడ భామ రష్మిక మందన్న మరోసారి శ్రీవల్లి పాత్రలో మెరవనుంది.

    అలానే, ఫహద్ ఫాసిల్,జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు,ప్రకాశ్ రాజ్,సునీల్,అనసూయ భరద్వాజ్,రావు రమేశ్,ధనంజయ,షణ్ముఖ్,అజయ్, శ్రీతేజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

    మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

    ఈచిత్రం పట్ల నెలకొన్న అంచనాలు మామూలుగా లేవు,అల్లు అర్జున్ అభిమానులు ఇప్పటికే విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుష్ప 2

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    పుష్ప 2

    Pushpa 2: పుష్ప సినిమా నుండి మే1న సెన్సేషనల్ సర్ప్రైజ్  సినిమా
    Pushpa 2: పుష్ప.. ది రూల్‌ నుంచి పుష్ప పుష్ప ఫుల్ సాంగ్‌ లాంఛ్.. ఎప్పుడంటే? సినిమా
    Pushpa 2: నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే..  పుష్ప పుష్ప ఫుల్ సాంగ్‌ సినిమా
    Pushpa Song Update : పుష్ప 2లో శ్రీవల్లి సాంగ్ రిలీజ్ రేపే సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025