Atlee - Priya: అట్లీ ఇంట పండుగ వాతావరణం.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రియ
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ డైరెక్టర్ అట్లీ కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. నేడు ఆయనకు రెండో సంతానంగా కుమార్తె పుట్టినట్టు ప్రకటించారు. అట్లీ, ఆయన భార్య ప్రియ దంపతులకు ఇప్పటికే మీర్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆడబిడ్డ జన్మించడంతో వారి సంతోషం మరింత రెట్టింపు అయింది. ఈ సంతోషకరమైన విషయాన్ని అట్లీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. "ఆశీర్వదించబడ్డాను" అనే క్యాప్షన్‌తో ఒక అందమైన పోస్టర్‌ను షేర్ చేశారు. ఆ పోస్టర్‌లో వారి కుమారుడు మీర్ చిత్రం ఉండగా, "యే! నాకు చెల్లెలు పుట్టింది" అని రాసి ఉంది. అలాగే 2026 ఏప్రిల్ 20న తమకు పాప పుట్టినట్టు అందులో పేర్కొన్నారు.
వివరాలు
భారీ యాక్షన్ మూవీగా 'రాకా'
అట్లీ ప్రొఫెషనల్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ , దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో 'రాకా' అనే భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ 44వ జన్మదినం సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. గుండు తలతో, రగ్డ్ స్టైల్‌లో ఉన్న అల్లు అర్జున్ ముఖాన్ని తోడేలు పంజా అడ్డంగా కప్పినట్లుగా చూపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.