Loading...
Allu Arjun RAAKA: రాకాపై బన్నీ క్రేజ్‌ అప్డేట్‌...ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న ఫ్యాన్స్
రాకాపై బన్నీ క్రేజ్‌ అప్డేట్‌...ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న ఫ్యాన్స్

Allu Arjun RAAKA: రాకాపై బన్నీ క్రేజ్‌ అప్డేట్‌...ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న ఫ్యాన్స్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 15, 2026
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'రాకా' సినిమాపై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా షూటింగ్‌లో బన్నీ పూర్తిగా బిజీగా ఉండటంతో ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు చాలా పరిమితంగానే బయటకు వచ్చాయి. దీంతో అసలు సినిమా ఎలా ఉండబోతుంది? బన్నీ ఎలాంటి పాత్రలో కనిపించనున్నారు? అనే ప్రశ్నలు ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పుడు ఈ ఎదురుచూపులకు చిన్న బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది.

Details

'ఆకాశంలో ఒక తార' ఈవెంట్‌లో బన్నీ

ఈరోజు హైదరాబాద్‌లో జరగనున్న 'ఆకాశంలో ఒక తార' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమానికి బన్నీ రావడంతో అందరి దృష్టి ఒక్కసారిగా 'రాకా' వైపే మళ్లింది.

ఈ సందర్భంగా ఆయన తన కొత్త సినిమాకు సంబంధించిన కీలకమైన విషయాన్ని చెబుతారా? షూటింగ్ ఎంతవరకు పూర్తయింది? సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది? వంటి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Details

ముగ్గురు హీరోయిన్లు.. భారీ క్రేజ్

'రాకా'లో దీపికా పడుకోణె హీరోయిన్‌గా నటిస్తున్న విషయం ఇప్పటికే తెలిసిందే. ఆమెతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. బన్నీకి ఉన్న క్రేజ్‌కు అట్లీ మార్క్‌ జతకావడంతో సినిమా అనౌన్స్‌మెంట్‌ నుంచే భారీ హైప్‌ ఏర్పడింది.

ADVERTISEMENT

Details

డాన్ చుట్టూ తిరిగే కథ?

ఇక 'రాకా' కథ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఓ డాన్ చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం.

ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లు కూడా సినిమాకు పనిచేస్తుండటంతో విజువల్స్, యాక్షన్ సన్నివేశాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

మరి బన్నీ ఈరోజు ఈవెంట్‌లో 'రాకా' గురించి ఏదైనా సర్‌ప్రైజ్ ఇస్తారా? అనేది ఇప్పుడు ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ADVERTISEMENT