
జవాన్: షారుకు ఖాన్ కు ఎస్ చెప్పేసిన అల్లు అర్జున్, పుష్ప కంటే ముందుగానే వెండితెర మీదకు
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో అల్లు అర్జున్ అతిధి పాత్రలో కనిపించనున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. ఐతే అప్పట్లో అల్లు అర్జున్ తిరస్కరించాడని, జవాన్ సినిమాలో అల్లు అర్జున్ కనిపించట్లేదని అన్నారు.
తాజా సమాచారం ప్రకారం జవాన్ సినిమాలో అల్లు అర్జున్ కనిపిస్తున్నాడని సమాచారం అందుతోంది. షారుక్ ఖాన్ సినిమాలో నటించడానికి అల్లు అర్జున్ ఎస్ చెప్పేసారట.
జవాన్ లో అల్లు అర్జున్ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందని, దీనికోసం ఒకపూట షూటింగ్ లో పాల్గొంటే సరిపోతుందని చెబుతున్నారు.
Details
జవాన్ లో కనిపించనున్న తమిళ హీరో విజయ్
యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే జవాన్ సినిమాలో అల్లు అర్జున్ ఎపిసోడ్ అందరికీ నచ్చేలా ఉంటుందని అంటున్నారు. అల్లు అర్జున్ తో పాటు తమిళ హీరో దళపతి విజయ్ కూడా క్యామియోలో కనిపిస్తారట.
విజయ్ తాలూకు చిత్రీకరణ ఆల్రెడీ జరిగిపోయిందని సమాచారం.
జవాన్ సినిమా కథ ఏంటంటే:
ఇదొక యాక్షన్ రివేంజ్ డ్రామాగా రూపొందుతుందని, సమాజంలోని చెడుపై పోరాడే పాత్రలో షారుక్ ఖాన్ కనిపిస్తారని వినిపిస్తోంది.
ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్నాడు దర్శకుడు అట్లీ.
రెడ్ చిల్లీస్ బ్యానర్ లో రూపొందుతున్న జవాన్ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా కనిపిస్తోంది. 2023 జూన్ 2న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది.