Page Loader
అల్లు అర్జున్‌కు మంచు విష్ణు లేఖ.. బన్నీ రిప్లై ఇచ్చిన ట్వీట్ వైరల్ 
అద్భుతమైన లేఖకు సంతోషపడుతున్న పుష్పరాజ్

అల్లు అర్జున్‌కు మంచు విష్ణు లేఖ.. బన్నీ రిప్లై ఇచ్చిన ట్వీట్ వైరల్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 10, 2023
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందిన పుష్ప హీరో అల్లు అర్జున్ కి 'మా' అసోసియేషన్ ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఈ మేరకు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు బన్నీకి ప్రశంస లేఖ రాశారు. 'డియర్ అల్లు అర్జున్, మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నట్లు ఆశిస్తున్నానని, పుష్పలో మీ అద్భుతమైన నటనకు జాతీయ అవార్డు వచ్చినందున 'మా' తరపున శుభాకాంక్షలు' అని లేఖలో చెప్పారు. కృషి, కష్టం వల్లే నేషనల్ అవార్డు సాధించిన తొలి తెలుగు నటుడిగా చిత్రసీమకే గుర్తింపు తెచ్చారని కొనియాడారు. మరోవైపు విష్ణు లేఖపై బన్నీ స్పందించారు. 'మంచి విష్ణు గారు.. ధన్యవాదాలు' అంటూ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విష్ణుకు రిప్లై ఇస్తూ బన్నీ చేసిన ట్వీట్