Allu Arjun: రెండు భాగాలుగా అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ.. క్లారిటీ ఇదే!
తెలుగు సినీ పరిశ్రమలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ వరల్డ్ వైడ్‌గా పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ 'పుష్ప ది రూల్' చేస్తున్నాడు. మరోవైపు అల్లు అర్జున్, త్రివిక్రమ్ నాలుగో సినిమాకు కూడా రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. ఇక నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలని డైరక్టర్ త్రివిక్రమ్ భావిస్తున్నట్లు సమాచారం. కథ డిమాండ్ దృష్ట్యా ఈ సినిమాను రెండు భాగాలు తీయాలని త్రివిక్రమ్ నిర్మాతతో చెప్పినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ జోరందుకున్న సీక్వెల్ ట్రెండ్
దర్శకుడిగా త్రివిక్రమ్ తొలి పాన్ ఇండియాగా తీసే ఈ సినిమాను 2025లో విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ తో కలిసి హారిక హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తమన్ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రజెంట్ సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. ఇక త్రివిక్రమ్, మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తియైతే వెంటనే అల్లు అర్జున్ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. పుష్ప 2 సినిమా 2024 అగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.