తదుపరి వార్తా కథనం

Allu Arjun : పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్.. గాయపడిన మార్క్ శంకర్‌కు పరామర్శ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 15, 2025
09:21 am
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి ప్రముఖ హీరో అల్లు అర్జున్ తన భార్య స్నేహతో కలిసి వెళ్లారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే.
ఈ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ దంపతులు పవన్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్లినట్లు సమాచారం.
వారు చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పారు.
Details
కోలుకుంటున్న మార్క్ శంకర్
సింగపూర్‌లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ అక్కడి ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
ఈ పరిస్థితుల మధ్య పవన్ కళ్యాణ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు మార్క్ శంకర్, కుమార్తె పొలెనా అంజనా పవనోవాలను తనతో పాటు హైదరాబాద్‌కు తీసుకురావాలని నిర్ణయించి, తీసుకొచ్చారు.