
బ్రో తో పాటు ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే.. డోన్ట్ మిస్
ఈ వార్తాకథనం ఏంటి
గత మూడు వారాలుగా థియేటర్లలో చిన్న సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన బేబీ సినిమా సూపర్ హిట్ టాక్ తో టాలీవుడ్‌లో రికార్డులను సృష్టిస్తోంది.
ఇక ఈవారం పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన మల్లీస్టారర్ మూవీ బ్రో థియేటర్లలో సందడి చేయనుంది. పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమాకు ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వం వహించాడు. తమిళంలో సూపర్ హిట్ సాధించిన 'వినోదయ సిత్తం' రిమేక్ గా ఈ సినిమాను చిత్రీకరించారు.
కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, బ్రహ్మనందం, సముద్రఖని, రోహిణి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషించారు.
Details
ఈనెల 29న స్లమ్ డాగ్ హస్పెండ్ రిలీజ్
ప్రముఖ నటుడు బ్రహ్మజీ కొడుకు సంజయ్ రావు నటించిన చిత్రం 'స్లమ్ డాగ్ హస్పెండ్' ఈ నెల 29న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటించగా.. బ్రహ్మజీ, సప్తగిరి ప్రధాన పాత్రలను పోషించారు.
రణవీర్ సింగ్, అలియా భట్ నటించిన బాలీవుడ్ చిత్రం 'రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ' చిత్రం ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
ఇక ఓటీటీలో ఉదయ నిధి స్టాలిన్, వడివేలు, కీర్తి సురేష్ నటించిన 'మామన్మన్' జులై 27న నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.