Hari Hara Veera Mallu: రెండు భాగాలుగా 'హరి హర వీర మల్లు'.. ప్రకటించిన ఏఎమ్ రత్నం
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దృష్టి మొత్తం ఎన్నకలపైనే కేంద్రీకరించారు. దానికోసం తన చేతిలో ఉన్న సినిమా షూటింగ్‌లన్నీనిలిపివేశారు.ఇలాంటి వేళ హరిహర వీరమల్లు సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ బయటికొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో,చిత్ర నిర్మాత, AM రత్నం ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. హరి హర వీర మల్లు రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు ధృవీకరించారు. సినిమా ఆగిపోయినట్లు,క్యాన్సిల్ చేస్తున్నట్లు వచ్చిన పుకార్లను తోసిపుచ్చారు. ఈ చిత్రానికి సంబంధించి VFX పనూలు జరుగుతున్నాయని గుర్తు చేశారు.
కీలక పాత్రలో యానిమల్ స్టార్
పవన్ కళ్యాణ్ అభిమానులకి మంచి సినిమా ఇచ్చే విషయంలో కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి వచ్చాక సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆ తర్వాత రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటిస్తామని తెలిపారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, యానిమల్ స్టార్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను డైరెక్టర్ చేస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.